షాకింగ్ : గూగుల్ ప్లే స్టోర్ పై వైరస్ దాడి

షాకింగ్ : గూగుల్ ప్లే స్టోర్ పై వైరస్ దాడి - Sakshi

ప్రపంచవ్యాప్తంగా జరిగిన వన్నాక్రై సైబర్ అటాక్ తో ఇంకా తేరుకోనే లేదు, అప్పుడే మరోసారి స్మార్ట్ ఫోన్లపై వైరస్ దాడి జరిగింది. ఆండ్రాయిడ్ యూజర్లను టార్గెట్ చేసుకుని.. ఓ మాల్ వేర్ స్మార్ట్ ఫోన్లలోకి చొప్పించుకుని వచ్చేసింది. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఈ వైరస్ దాడి జరిగినట్టు సెక్యురిటీ రీసెర్చ్ సంస్థ చెక్ పాయింట్ గుర్తించింది. జుడీ అనే మాల్వేర్ గూగుల్ ప్లే స్టోర్ లోకి చొరబడినట్లు ఈ సెక్యురిటీ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. 41 యాప్స్ లో ఈ వైరస్ ఉన్నట్టు తేలింది. ఇప్పటికే 85 లక్షల నుంచి 3.65 కోట్ల మంది యూజర్లకు దీనికి ప్రభావితమైనట్టు రిపోర్టు చేసింది. ఈ విషయంపై చెక్ పాయింట్ గూగుల్ ను అలర్ట్ చేసింది. 

 

దీంతో మాల్వేర్ చొరబడిన యాప్స్ ను గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి తొలగించేస్తోంది. ' ఈ జుడీ మాల్ వేర్ 'ఆటో క్లికింగ్ యాడ్ వేర్' అని చెక్ పాయింట్ తన బ్లాక్ లో పేర్కొంది.  ఈ మాల్ వేర్ తో స్మార్ట్ ఫోన్లు ప్రభావితమైన అనంతరం నకిలీ యాడ్ క్లిక్స్ ను క్రియేట్ చేస్తూ హ్యాకర్లు డబ్బులు గుంజుతారని తెలిపింది. దక్షిణ కొరియా దిగ్గజ కంపెనీ కినీవినీ అభివృద్ధి చేసిన కొన్ని యాప్ ల ద్వారా ఇది వచ్చినట్టు రీసెర్చ్ సంస్థ చెప్పింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ లకు ఆ  సంస్థ యాప్స్ ను డెవలప్ చేస్తోంది.  ఈ మాల్ వేర్ తో ప్రభావితమైన యాప్స్ ఇప్పటికే 45 లక్షలకు పైగా డౌన్ లోడ్ అయ్యాయి.    

 
Read latest Technology News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top