శశికళ గదిలో జయలలితకు రాసిన సీక్రెట్‌ లెటర్‌

Gutka scam secret letter found in Sasikala room - Sakshi

సాక్షి, చెన్నై : తమిళనాడులో కలకలం సృష్టించిన గుట్కా స్కాంకు సంబంధించిన రహస్య లేఖ ఒకటి మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత నిచ్చెలి శశికళ గదిలో లభించింది. గత నవంబర్‌(2017)లో ఆదాయపన్ను శాఖ అధికారులు నిర్వహించిన సోదాల్లో ఇది బయటపడింది. ఈ మేరకు మద్రాస్‌ హైకోర్టుకు ఐటీ వారు ఇచ్చిన అఫిడవిట్‌ ఐటీ ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌ సుసీ బాబు వర్గీస్‌ పేర్కొన్నారు. గుట్కా స్కాంపై వెంటనే సీబీఐ దర్యాప్తు నిర్వహించాలని డీఎంకే ఎమ్మెల్యే అంబజగన్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు.

దీంతో కోర్టు ఆదేశాల మేరకు ఐటీ అధికారులు పోయెస్‌ గార్డెన్‌లోని వేద నిలయంలో సోదాలు నిర్వహించగా శశికళ గదిలో ఓ లేఖ లభించింది. వర్గీస్‌ తెలిపిన ప్రకారం.. ఆ లేఖ ఆగస్టు 11న 2016న నాటి ఐటీ ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌ ముఖ్యమంత్రి జయలలితకు, నాటి డీజీపీకి లేఖ రాశారు. ఈ కుంభకోణంలో ఓ రాష్ట్ర మంత్రితోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సీనియర్‌ అధికారులు సంబంధాలు కలిగి ఉన్నారని, పోలీసులకు కూడా సంబంధం ఉందని పేర్కొన్నారు. అలాగే, ప్రభుత్వంతో సంబంధం కలిగి ఉన్న పార్టీలన్నింటికి కూడా ముడుపులు పోయినట్లు వెల్లడించారు. వెంటనే దీనిపై స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
 

Read latest Tamil Nadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top