స్టేషన్‌లోనే కొట్టుకున్న సీఐ, ఎస్‌ఐ..! | Sakshi
Sakshi News home page

స్టేషన్‌లోనే కొట్టుకున్న సీఐ, ఎస్‌ఐ..!

Published Wed, Nov 8 2017 8:22 PM

circle inspector beats sub inspector 

సాక్షి, చెన్నై: ఇద్దరు పోలీసు అధికారులు పరస్పరం దూషించుకోవడమే కాకుండా ఒకరిమీద ఒకరు పడి కొట్టుకున్నారు. ఈ ఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా పోచ్చంపల్లి సమీపంలోని మత్తూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం చోటుచేసుకుంది. ఈ స్టేషన్‌లో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా రామ అండవర్‌, ఎస్‌ఐగా పార్తీబన్‌లు విధులు నిర్వహిస్తున్నారు. ఎస్‌ఐ పార్తీబన్‌ బుధవారం ఆలస్యంగా వచ్చాడని సీఐ రామ అండవర్‌ తప్పుగా మాట్లాడినట్లు సమాచారం. దీంతో ఇద్దరికి తగాదా ఏర్పడి కొట్టుకునేందుకు దారి తీసిందని స్టేషన్‌కు వచ్చిన స్థానికుల ద్వారా తెలిసింది.

ఆవేశంతో ఇన్‌స్పెక్టర్‌ రామ ఆండవర్‌, పార్తీబన్‌ ముక్కుపై బలంగా కొట్టాడు. దీంతో ఆయన కింద పడిపోయాడు. ఆపై ఇద్దరు కిందపడి కొట్టుకున్నారు. అనంతరం గాయాలైన ఇద్దరినీ మత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్‌పీ మహేశ్‌ కుమార్‌ విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీఎస్పీని ఆదేశించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement