బాబు పదవి నుంచి తప్పుకోవాలి : ధర్మాన
ఏసీబీ విచారణ పూర్తయ్యేంత వరకు చంద్రబాబు సీఎం పదవి నుంచి తప్పుకోవాలని ధర్మాన డిమాండ్ చేశారు.
శ్రీకాకుళం: ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ విచారణ పూర్తయ్యేంత వరకు సీఎం చంద్రబాబు తన పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ....కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పదవుల నుంచి తప్పుకోవడం సాంప్రదాయమన్నారు.
గవర్నర్ నరసింహన్ ఈ మేరకు చంద్రబాబుకు తగు సూచనలు చేసి వ్యవస్థపై నమ్మకం పెంచాల్సిన అవసరముందని ఆయన చెప్పారు. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు చేసే ప్రయత్నాల వల్ల ప్రజలకు వ్యవస్థపై నమ్మకం పోతుందని ధర్మాన ఆవేదన వ్యక్తం చేశారు.