మంగళంపల్లి మృతి పట్ల వైఎస్‌​ జగన్‌ సంతాపం | ys jagan mohan reddy pays condolence to mangalampalli's death | Sakshi
Sakshi News home page

మంగళంపల్లి మృతి పట్ల వైఎస్‌​ జగన్‌ సంతాపం

Nov 22 2016 6:39 PM | Updated on Jul 25 2018 4:09 PM

మంగళంపల్లి మృతి పట్ల వైఎస్‌​ జగన్‌ సంతాపం - Sakshi

మంగళంపల్లి మృతి పట్ల వైఎస్‌​ జగన్‌ సంతాపం

మంగళంపల్లి మృతి పట్ల వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

హైదరాబాద్‌ : ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు, గాన గంధర్వుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ మృతి పట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం ట్విట్టర్ ద్వారా ఆయన తన సంతాపం తెలిపారు. బాలమురళీకృష్ణ మృతితో తాను చాలా బాధపడ్డానని, ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. 

త్యాగరాయ, రామదాసు కీర్తనలు, తత్వాలు, భక్తిగీతాలు, ఆయన పాడిన ప్రతి పాట ఏనాటికీ చిరస్మరణీయంగా మిగిలిపోతాయని వైఎస్‌ జగన్‌ కొనియాడారు. మంగళంపల్లి మరణం సంగీత ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానని వైఎస్‌ జగన్‌ సంతాప సందేశంలో పేర్కొన్నారు.

 

Advertisement

పోల్

Advertisement