నిబంధనలకు విరుద్ధంగా స్నేహితులకు విందు

తిరువళ్లూరు : జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉన్నా కొంతమంది యువకులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఆరుగురు యువకులు నిబంధనలు ఉల్లంఘించి విందు చేసుకోవడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అధికారులు 144 సెక్షన్ విధించారు. ప్రజలు గుంపుగా ఒకచోట చేరకూడదని నిబంధన విధించారు. అయితే నిబంధనలను ఉల్లంఘిస్తూ పెనాలూరుపేట సమీపంలోని తన్నీకుళం గ్రామానికి చెందిన సుమారు 20 మంది యువకులు విందు ఏర్పాటు చేసుకున్నారు. ఒకేచోట బిర్యానీ చేసుకొని భౌతిక దూరం పాటించకుండా ఒకేచోట కూర్చుని తింటున్న ఫొటోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ సంఘటన ఎస్పీ అరవిందన్ దృష్టికి రావడంతో యువకులను అరెస్టు చేయాలని ఆదేశించారు. దీంతో పెనాలూరుపేట పోలీసులు విందులో పాల్గొన్న యువకులను గుర్తించి అరెస్టు చేశారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి