కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత వంటి పై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసింది.
ఇంటి ముందు ముగ్గు వేయలేదని..
Jan 6 2017 11:13 AM | Updated on Sep 5 2017 12:35 AM
వేములపల్లి: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత వంటి పై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా వేములపల్లిలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న యాదగిరి, భాగ్యలక్ష్మి(28) దంపతులు వ్యవసాయ కూలీలుగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య తగాదాలు నడుస్తున్నాయి.
శుక్రవారం ఉదయం యాదగిరి ఇంటి ముందు ముగ్గు ఎందుకు వేయలేదని భార్యతో వాదన పెట్టుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ కాస్త ముదిరింది. దీంతో మనస్తాపానికి గురైన భాగ్యలక్ష్మి వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఇది గుర్తించిన స్థానికులు ఆమెను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆమెకు వైద్యం చేస్తున్న వైద్యులు 90 శాతం కాలడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు.
Advertisement
Advertisement