భలే కిలాడీ | woman tries to kill husband | Sakshi
Sakshi News home page

భలే కిలాడీ

Jun 4 2017 10:00 AM | Updated on Sep 5 2017 12:49 PM

భలే కిలాడీ

భలే కిలాడీ

భర్తను హత్య చేయించడానికి భార్య ప్రయత్నించిన ఘటన శనివారం కర్ణాటక కాడుగోడి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బెళతూరులో జరిగింది.

ప్రియునితో కలిసి భర్తపై హత్యాయత్నం
 
కృష్ణరాజపుర: భర్తను హత్య చేయించడానికి భార్య ప్రయత్నించిన ఘటన శనివారం కర్ణాటక కాడుగోడి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బెళతూరులో జరిగింది. బెళతూరు గ్రామానికి చెందిన సోమశేఖర్‌కు అదే గ్రామానికి చెందిన సుధతో పదేళ్ల వివాహమైంది. ఈ క్రమంలో సుధకు కొద్దికాలం క్రితం అదే ప్రాంతానికి చెందిన అరుణ్‌తో ఏర్పడిన పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరి వ్యవహారం సుధ భర్త సోమశేఖర్‌కు తెలియడంతో కొద్ది కాలంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

శుక్రవారం రాత్రి కూడా ఇదే విషయమై ఇరువురి మధ్య గొడవ జరగడంతో సుధ భర్త సోమశేఖర్‌ను హత్య చేయాలంటూ ప్రియుడు అరుణ్‌కు సూచించింది. దీంతో అరుణ్‌ శుక్రవారం రాత్రి పనిపై బయటకు వచ్చిన సోమశేఖర్‌పై తన సహచరులతో కలసి అరుణ్‌ ఇనుపరాడ్లు, కత్తులతో దాడి చేశారు. దీంతో సోమశేఖర్‌ స్పృహ తప్పి పడిపోవడంతో సోమశేఖర్‌ మరణించాడని భావించిన నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సోమశేఖర్‌ను కే.ఆర్‌.పుర ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement