ఓటరు గుర్తింపు కార్డు కాదు పెళ్లి పత్రిక

Wedding Couple Variety Wedding Card Distribution in Karnataka - Sakshi

బొమ్మనహళ్లి : ఓటు హక్కుపై తమ వంతు జాగృతి కల్పించేందుకు ఓ జంట తమ పెళ్లి పత్రికను ఎన్నికల గుర్తింపు కార్డులా ప్రచురించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ధార్వాడలో బెస్కాం అధికారి మంజునాథ్‌ కుమారుడు సునీల్‌కు, హెస్కాంలో పనిచేస్తున్న మరో ఇంజనీర్‌ మహేశ్‌ సోదరి అన్నపూర్ణలకు వివాహం నిశ్చయించారు. ఈనెల 26న వీరి వివాహం జరగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండటంతో ఓటు ప్రాధాన్యత,  ఓటు హక్కు వినియోగం ఆవశ్యకతను తెలియజేయడానికి ఈ కాబోయే జంట తమ పెళ్లి కార్డును ఓటరు కార్డుల ముద్రించి అందరికి ఆహ్వానం పంపారు. ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని అందులో పేర్కొన్నారు. దీంతో ప్రతి ఒక్కరూ ఈ నూతన జంటను అభినందిస్తున్నారు. ప్రస్తుతం ఈ కార్డు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top