జాతాతో ఓటర్లలో చైతన్యం: కలెక్టర్ | Voters mobility | Sakshi
Sakshi News home page

జాతాతో ఓటర్లలో చైతన్యం: కలెక్టర్

Apr 2 2014 4:12 AM | Updated on Sep 2 2017 5:27 AM

లోక్‌సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా జాతా ద్వారా చైతన్యం తెస్తున్నటు జిల్లా ఎన్నికల అధికారి నాగరాజ్ తెలిపారు.

రాయచూరు రూరల్, న్యూస్‌లైన్ :లోక్‌సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా జాతా ద్వారా చైతన్యం తెస్తున్నటు జిల్లా ఎన్నికల అధికారి నాగరాజ్ తెలిపారు.అధికార యంత్రాంగం మంగళవారం ఏర్పాటు చేసిన జాతాను స్థానిక మార్కెట్ యార్డు పోలీస్ స్టేషన్ వద్ద ఆయన జెండా ఊపి ప్రారంభించారు.అనంతరం జాతా వివిధ ప్రాంతాల మీదుగా సాగుతూ ఓటర్లను చైతన్య పరిచింది.  
 
అంతకు ముందు ఓటు హక్కు వినియోగంపై ప్రమాణం చేయించారు.ఎస్పీ నాగరాజ్ మాట్లాడుతూ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు రెండు కేఎస్‌ఆర్‌పీ , 10 డీపీఆర్ బలగాలతోపాటూ 540 మంది సివిల్ పోలీస్, 847 మంది హోంగార్డ్‌ను నియమించినట్లు చెప్పారు. సీఐఎస్‌ఎఫ్ అధికారి సంజీవకుమార్, ఏఎస్పీ అశోక్, డీఎస్పీ మడివాళ, చంద్రశేఖర్, ఆలీబాబా, బసవరాజ, బేబీ వాలేకర్, సరళ, సురేష్, నదాఫ్, దాదావలి, నాగరాజ అయ్యనగౌడ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement