
సాక్షి, చెన్నై : జ్వరంతో చెన్నైలోని లీమా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ రచయిత, విమర్శకుడు, సినీ నటుడు గొల్లపూడి మారుతీరావును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మంగళవారం పరామర్శించారు. గొల్లపూడి కుటుంబ సభ్యులను ఆయన ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, గొల్లపూడి ఆరోగ్యం కుదుటపడిందని బుధవారం డిశ్చార్జ్ కానున్నారని ఆయన కుమారుడు రామకృష్ణ తెలిపారు.
సునిశతమైన విమర్శకు, ఆధ్యాత్మిక, రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను ముక్కుసూటిగా వెల్లడించడంలో గొల్లపూడి పెట్టింది పేరని వెంకయ్య అన్నారు. ఆయన త్వరలోనే కోలుకుని సంపూర్ణ ఆయురారోగ్యాలను పొందాలని వెంకయ్య ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు.