టీఎంసీ సరిహద్దుల పెంపునకు యూడీడీ పచ్చజెండా | UDD approved to Increase the range of the boundary of TMC | Sakshi
Sakshi News home page

టీఎంసీ సరిహద్దుల పెంపునకు యూడీడీ పచ్చజెండా

Nov 23 2013 11:17 PM | Updated on Sep 2 2017 12:54 AM

త్రయంబకేశ్వర్ మున్సిపాలిటీ సరిహద్దు పరిధి పెంపునకు పట్టణ అభివృద్ధి విభాగం (యూడీడీ) ఆమోదం తెలిపింది.

నాసిక్:  త్రయంబకేశ్వర్ మున్సిపాలిటీ సరిహద్దు పరిధి పెంపునకు పట్టణ అభివృద్ధి విభాగం (యూడీడీ) ఆమోదం తెలిపింది. కుంభమేళా సమీపిస్తున్న నేపథ్యంలో ఇక్కడికి వచ్చే భక్తులకు మౌలిక వసతులు కల్పించేందుకు, తగు సేవలు అందించేందుకుగాను సరిహద్దుల పెంపునకు అనుమతించాలని కోరుతూ త్రయంబకేశ్వర్ మున్సిపల్ కౌన్సిల్ (టీఎంసీ) కొద్దిరోజుల క్రితం ఓ ప్రతిపాదనను పట్టణ అభివృద్ధి విభాగం (యూడీడీ)కి పంపిన సంగతి విదితమే. ఇందుకు ఆమోదం తెలిపిన యూడీడీ దానిని న్యాయమంత్రిత్వ శాఖకు పంపించింది. న్యాయమంత్రిత్వ శాఖ ఆమోదం లభించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంగా ఓ ప్రకటన చేయనుంది.

ఈ విషయమై టీఎంసీకి చెందిన ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ అపెక్స్ కమిటీలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కుంభమేళాకు సంబంధించి 90 శాతం పనులను పూర్తిచేశామన్నారు. తమ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపితే టీఎంసీ సరిహద్దు పరిధి 1.89 కిలోమీటర్లనుంచి 11.794 కిలోమీటర్లకు పెరుగుతుందన్నారు. ప్రణాళికాబద్ధంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయొ చ్చన్నారు. టీఎంసీ చుట్టుపక్కల గ్రామాలు రెవె న్యూ విభాగం పరిధిలో ఉన్నాయని, ఏ గ్రామపంచాయితీ పరిధిలో లేవన్నారు. అందువల్ల ప్రతి చిన్నపనికీ కలెక ్టర్ కార్యాలయాన్ని సంప్రదించాల్సి ఉంటుందన్నారు. అయితే తమ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే ప్రజలు కలెక్టర్ కార్యాలయాన్ని సంప్రదించాల్సిన అవసరం ఉండదన్నారు. వారు తమను నేరుగా సంప్రదించే వెసులుబాటు లభిస్తుంది. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే ఈ పరిస్థితి మారిపోతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement