రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరి మృతి | two people have died and others have been badly | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరి మృతి

Oct 2 2013 3:42 AM | Updated on Sep 1 2017 11:14 PM

బైక్‌ను ఆటో ఢీకొనడంతో గాయపడిన ఇద్దరు యువకులు నాలుగు రోజుల అనంతరం మంగళవారం బళ్లారి విమ్స్ ఆస్పత్రిలో మృతి చెందారు.

గంగావతి, న్యూస్‌లైన్ : బైక్‌ను ఆటో ఢీకొనడంతో గాయపడిన ఇద్దరు యువకులు నాలుగు రోజుల అనంతరం మంగళవారం బళ్లారి విమ్స్ ఆస్పత్రిలో మృతి చెందారు. గత శుక్రవారం కొప్పళ నుంచి గంగావతికి వస్తున్న బైక్‌ను ఎదురుగా వస్తున్న ఆటో దాసనాళ బ్రిడ్జ్ సమీపంలో ఢీ కొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న మల్లికార్జున (34), భీమిరెడ్డి(36)లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని గంగావతి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చగా వారిద్దరినీ మెరుగైన చికిత్స కోసం బళ్లారి విమ్స్‌కు తరలించారు. అయితే వారు బళ్లారి విమ్స్‌లో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు కేసు నమోదు చేయాలని వారి బంధువులు పోలీసులను ఆశ్రయించగా పోలీసులు నిరాకరించడంతో మృతదేహాలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చి నిరసనకు ప్రయత్నించారు. ముందుగా ఆ విషయాన్ని గ్రహించిన పోలీసులు హొసళ్లి వద్ద అడ్డుకున్నారు. వారి బంధువుల విన్నపం మేరకు డీఎస్పీ కేసు నమోదుకు అంగీకరించగా ఆందోలనను విరమించుకుని తమ సొంత గ్రామం కనకగిరికి వెళ్లిపోయారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement