బర్గర్ తెచ్చిన తంటా ! | Troubles brought the burger | Sakshi
Sakshi News home page

బర్గర్ తెచ్చిన తంటా !

Jul 13 2016 1:57 AM | Updated on Sep 4 2017 4:42 AM

బర్గర్ తెచ్చిన తంటా !

బర్గర్ తెచ్చిన తంటా !

ఆన్‌లైన్ లో బుక్ చేసిన బర్గర్‌ను ఆలస్యంగా డెలివరీ చేయడంతో నిరాకరించిన మహిళపై కక్ష పెంచుకుని

ఆలస్యంగా డెలివరీ చేశాడని తిరస్కరణ
కక్షగట్టిన డెలివరీ బాయ్
కాల్‌గర్ల్ అంటూ వాట్సాప్‌లో కస్టమర్ ఫోన్ నంబర్
చివరకు ఊచలు లెక్కబెడుతున్న యువకుడు

 

బొమ్మనహళ్లి (బెంగళూరు) : ఆన్‌లైన్ లో బుక్ చేసిన బర్గర్‌ను ఆలస్యంగా డెలివరీ చేయడంతో నిరాకరించిన మహిళపై కక్ష పెంచుకుని ఆమె  ఫోన్ నెంబర్‌ను వాట్సాప్‌లో పెట్టి కాల్‌గర్ల్‌గా ప్రచారం చేసిన ఓ బర్గర్ డెలివరీ బాయ్ ప్రస్తుతం ఊచలు లెక్కపెడుతున్నాడు. నిందితుడు శ్రేయస్‌ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే... ఇక్కడి జేపీ నగర పోలీస్ స్టేషన్ పరిధిలో   జరిగిన సంఘటన వివరాలు.... ఈనెల 8న నగరానికి చెందిన ఓ యువతి ఆన్‌లైన్‌లో బర్గర్ ఆర్డర్ చేసింది. దానిని రాత్రి పది గంటల సమయంలో డెలివరీకి తీసుకు రావడంతో ఆమె నిరాకరించింది.


దీంతో అప్పటి నుంచి ఆమె కక్ష పెంచుకున్న డెలివరీ బాయ్ శ్రేయస్ సదరు యువతి ఫోన్ నెంబర్ వాట్సాప్ గ్రూప్‌లో పెట్టి కాల్‌గర్స్‌గా ప్రచారం చేశాడు. దీంతో తరచూ ఆ యువతికి అభ్యంతర ఫోన్‌కాల్స్ వస్తుండటంతో ఆమె ఫోన్ సిచ్చాఫ్ చేసి జేపీ నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేసి శ్రేయస్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో అసలు విషయం వెల్లడించాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement