త్రిష ఇల్లన్నా నయనతార ట్రీజర్ ఆవిష్కరణ | Trisha Illana Nayanthara Official Teaser released | Sakshi
Sakshi News home page

త్రిష ఇల్లన్నా నయనతార ట్రీజర్ ఆవిష్కరణ

Apr 19 2015 2:05 AM | Updated on Sep 3 2017 12:28 AM

త్రిష ఇల్లన్నా నయనతార ట్రీజర్ ఆవిష్కరణ

త్రిష ఇల్లన్నా నయనతార ట్రీజర్ ఆవిష్కరణ

త్రిష ఇల్లన్నా నయనతార చిత్ర ట్రీజర్ సోషల్ నెట్‌వర్క్సులో హల్‌చల్ చేస్తోంది. యువ సంగీత దర్శకుడు,

 త్రిష ఇల్లన్నా నయనతార చిత్ర ట్రీజర్ సోషల్ నెట్‌వర్క్సులో హల్‌చల్ చేస్తోంది. యువ సంగీత దర్శకుడు, నటుడు జి.వి.ప్రకాష్‌కుమార్ హీరోగా నటిస్తున్న చిత్రం త్రిష ఇల్లన్నా నయనతార. కయల్ ఫేమ్ నందిని హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి నవ దర్శకుడు అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర ట్రీజర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చిత్ర యూనిట్ శుక్రవారం నిర్వహించారు. నడిగర్ సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్ ఆధ్వర్యంలో తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్.థాను ఆవిష్కరించారు.
 
 ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ తాను మొట్టమొదట కథ వినిపించింది కలైపులి ఎస్.థానుకేనని తెలిపారు. అలాంటిది తనతొలి చిత్ర ట్రీజర్‌ను కూడా ఆయనే ఆవిష్కరించడం అంతులేని ఆనందాన్ని ఇస్తుందన్నారు. త్రిష ఇల్లన్నా నయనతార చిత్ర ట్రీజర్ ఇప్పటికే సోషల్ నెట్ వర్క్సులో విడుదలై ప్రేక్షకుల విశేష ఆదరణ పొందుతోందని దర్శకుడు అధిక్ రవిచంద్రన్ అన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement