breaking news
Trisha Illana Nayanthara
-
మనీషాకు మరో చాన్స్..!
వైవిధ్యభరిత కథా చిత్రాల దర్శకుడు వెట్రిమారన్. ఆయన నటుడు ధనుష్‌తో కలిసి నిర్మించిన విచారణై, కాక్కాముట్టై వంటి చిత్రాలు సామాజిక సమస్యలపై తెరకెక్కి మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. తాజాగా యువ దర్శకుడు రామ్‌నాథ్ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు వెట్రిమారన్. రామ్‌నాథ్ ఇంతకు ముందు జీవా, నయనతార జంటగా నటించిన తిరునాళ్ చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం. తాజాగా ఇన్వెస్టిగేటివ్ కథాంశాన్ని తీసుకుని వెట్రిమారన్ గ్రాస్‌రూట్ సంస్థలో చిత్రం చేయనున్నారు. ఇందులో నటి మనీషా యాదవ్ కథానాయకిగా నటించనుంది. మోడ్రన్ పాత్రలకైనా, గ్రామీణ యువతిగానైనా నటించి మెప్పించగల నటి మనీషాయాదవ్. తొలి చిత్రం వళక్కు ఎన్ 18/9 చిత్రంతోనే తనదైన నటనతో ప్రశంసలు అందుకున్న ఈ బ్యూటీ ఆ తరువాత ఆదలాల్ కాదల్ సెయ్‌వీర్, త్రిషా ఇల్లన్నా నయనతార వంటి చిత్రాల్లో నటించింది. త్రిషా ఇల్లన్నా నయనతార చిత్రంలో తనను అశ్లీలంగా చూపించారని ఆ చిత్ర దర్శకుడిపై ఆరోపణలు గుప్పించి సంచలన సృషించిన ఈ అమ్మడు నటనకు కొంత కాలం దూరమైంది. అలా అనడం కంటే ఈ జాణను చిత్ర పరిశ్రమ దూరంగా పెట్టిందనే చెప్పాలి. ఇటీవల ఒరు కుప్పెకథై చిత్రంలో అద్భుతమైన నటనను ప్రదర్శించిన ఈ అమ్మడికి నిర్మాత వెట్రిమారన్ అవకాశం ఇచ్చారు. ఇందులో మనీషా యాదవ్ గ్రామీణ యువతి పాత్రలో నటించనుంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్ర షూటింగ్ నవంబర్‌లో సెట్‌పైకి వెళ్లనుందని సమాచారం. ఈ చిత్రంలో మనీషా యాదవ్ పాత్ర చాలా బలంగా ఉంటుందని దర్శక నిర్మాతలు అంటున్నారు. దీనితో పాటు మరో చిత్రం మనిషాను వరించింది. కొత్త దర్శకుడు మిల్కా సెల్వకుమార్ చిత్రంలోనూ నటించడానికి మనీషాయాదవ్ పచ్చజెండా ఊపింది. ఇది హర్రర్ కామెడీ కథా చిత్రంగా ఉంటుందని తెలిసింది. -
త్రిష ఇల్లన్నా నయనతార ట్రీజర్ ఆవిష్కరణ
త్రిష ఇల్లన్నా నయనతార చిత్ర ట్రీజర్ సోషల్ నెట్‌వర్క్సులో హల్చల్ చేస్తోంది. యువ సంగీత దర్శకుడు, నటుడు జి.వి.ప్రకాష్‌కుమార్ హీరోగా నటిస్తున్న చిత్రం త్రిష ఇల్లన్నా నయనతార. కయల్ ఫేమ్ నందిని హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి నవ దర్శకుడు అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర ట్రీజర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చిత్ర యూనిట్ శుక్రవారం నిర్వహించారు. నడిగర్ సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్ ఆధ్వర్యంలో తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్.థాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ తాను మొట్టమొదట కథ వినిపించింది కలైపులి ఎస్.థానుకేనని తెలిపారు. అలాంటిది తనతొలి చిత్ర ట్రీజర్ను కూడా ఆయనే ఆవిష్కరించడం అంతులేని ఆనందాన్ని ఇస్తుందన్నారు. త్రిష ఇల్లన్నా నయనతార చిత్ర ట్రీజర్ ఇప్పటికే సోషల్ నెట్ వర్క్సులో విడుదలై ప్రేక్షకుల విశేష ఆదరణ పొందుతోందని దర్శకుడు అధిక్ రవిచంద్రన్ అన్నారు.