గోడ కూలి ముగ్గురు కూలీల దుర‍్మరణం | three women workers died after wall collapses | Sakshi
Sakshi News home page

గోడ కూలి ముగ్గురు కూలీల దుర‍్మరణం

Jan 7 2017 2:11 PM | Updated on Sep 5 2017 12:41 AM

వేరుశెనగ మిల్లు గోడ కూలి ముగ్గురు మహిళా కూలీలు అక‍్కడికక‍్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

వరంగల్‌: వరంగల్‌ శివారులోని ఎనమాముల గ్రామం వద‍్ద ఉన‍్న వేరుశెనగ మిల్లు గోడ కూలి ముగ్గురు మహిళా కూలీలు అక‍్కడికక‍్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన శనివారం జరిగింది. మిల్లులో పనిచేస‍్తున‍్న కూలీలు ప్రహరీ గోడ వద‍్ద కూర్చుని ఉండగా గోడ ఒక‍్కసారిగా కూలిపోయింది. దాంతో కొమ‍్ము స‍్వరూప, ఎం.స‍్వరూప, ఉల్లి రేణుక అనే మహిళా కూలీలు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ సంఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్షతగాత్రులను 108లో ఆస‍్పత్రికి తరలించారు. సంఘటన స‍్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార‍్టం నిమిత‍్తం మార్చురీకి తరలించారు. మృతులందరూ ఎనమాముల గ్రామానికి చెందినవారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement