
మైసూరులో ఓ గర్భిణికి ఒకే కాన్పులో ముగ్గురు జన్మించారు. ఇందులో ఇద్దరు మగపిల్లలు కాగా ఒకరు ఆడపిల్ల
మైసూరు : వరమహాలక్ష్మీ పండుగ సందర్భం గా శుక్రవారం రాత్రి ఓ మహిళ ఒకేసారి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. నగరంలోని విజయనగర్‌కు చెందిన సవితాకు పురిటి నొప్పులు రావడంతో భర్త ప్రేమ్‌కుమార్ ఆమెను చెలువాంబ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ముగ్గురు పిల్లలున్నట్లు గుర్తించిన ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి ముగ్గురు పిల్లలను బయటకు తీశారు. ముగ్గురు పిల్లల్లో ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల ఉండగా ప్రస్తుతం ముగ్గురు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.