రూ.వెయ్యి పింఛన్‌కు త్వరలో శ్రీకారం | thoused rupess pinchan after Acme | Sakshi
Sakshi News home page

రూ.వెయ్యి పింఛన్‌కు త్వరలో శ్రీకారం

May 19 2014 1:11 AM | Updated on Sep 5 2018 8:20 PM

రూ.వెయ్యి పింఛన్‌కు త్వరలో శ్రీకారం - Sakshi

రూ.వెయ్యి పింఛన్‌కు త్వరలో శ్రీకారం

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) చందాదారులకు శుభవార్త.

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) చందాదారులకు శుభవార్త. ఉద్యోగుల పింఛన్ పథకం(ఈపీఎస్-95) కింద... పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు కనీస పింఛన్ రూ. వెయ్యి అందించాలన్న పథకం త్వరలో అమలు కానుంది. ఐదు లక్షల మంది వితంతువులు సహా.. 28 లక్షల మంది పెన్షనర్లకు ఇది ప్రయోజనం చేకూర్చనుంది. ఈ పథకం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రావాల్సి ఉన్నా ఎన్నికల నియమావళి వల్ల అది సాధ్యంకాలేదు.

 ఎన్నికలు పూర్తయినందున ఇప్పుడీ ఈ పథకాన్ని (ఈపీఎస్-95) అమలు చేయనున్నట్టు ఈపీఎఫ్‌ఓ అధికారి ఒకరు ఆదివారం తెలిపారు. ఇందుకోసం సన్నాహాలు చేస్తున్నట్టు వివరించారు.కనీస పింఛన్ కింద రూ.వెయ్యిని అందజేసేందుకోసం కేంద్రం ఈపీఎఫ్‌వోకు రూ.1,217 కోట్లను చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement