ప్రభుత్వ పతనం ఖాయం | The government would fall | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పతనం ఖాయం

Mar 23 2015 3:16 AM | Updated on Sep 2 2017 11:14 PM

ఐఏఎస్ అధికారి డీ.కే రవి అనుమానాస్పద మృతికి సంబంధించిన కేసును సీబీఐ దర్యాప్తునకు అప్పగించకుంటే రాష్ట్రంలోని సిద్ధరామయ్య ప్రభుత్వం పడిపోవడం....

సాక్షి,బెంగళూరు: ఐఏఎస్ అధికారి డీ.కే రవి అనుమానాస్పద మృతికి సంబంధించిన కేసును సీబీఐ దర్యాప్తునకు అప్పగించకుంటే రాష్ట్రంలోని సిద్ధరామయ్య ప్రభుత్వం పడిపోవడం ఖాయమని విపక్ష భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్‌జోషి జోస్యం చెప్పారు. డీ.కే రవి కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు స్థానిక మౌర్య హోటల్ వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఆదివారం నిరసన దీక్షకు దిగారు. నిష్పక్షపాతంగా వి దులు నిర్వర్తిస్తున్న ఓ ఐఏఎస్ అధికారి అనుమానాస్పదంగా మృతి చెందిన అరగంటలోపే ముఖ్యమంత్రి స్థానంలోని సి ద్ధరామయ్య, హోంమంత్రి కే.జే జార్జ్‌తోపాటు నగర పోలీస్ కమిషనర్ ఎం.ఎన్ రెడ్డి ఘటనను ఆత్మహత్యగా పేర్కొనడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.

ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని సీఐడీ ద్వారా కాక స్వతంత్య్ర ప్రతిపత్తి దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించాలని రాష్ట్రంలోని ప్రజలే కాకుండా దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారన్నారు. అయితే ప్రభుత్వం ఈ విషయం పట్ల ‘దున్నపోతు మీద వానపడ్డ’ చందంగా వ్యవహరిస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల మనోభావలకు అనుగుణంగా పాలన సాగించకపోతే అధికారంలోని ప్రభుత్వాలు కూలిపోక తప్పదన్నారు. అందువల్ల ప్రజలు కోరకుంటున్నట్లు డీ.కే రవి కేసును సీబీఐకి అప్పగించకుంటే కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ పార్టీ పడిపోవడం ఖాయమని అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించేంతవరకూ తమ పోరాటం ఆగదన్నారు. ఈనెల 24న ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ పార్టీలకతీతంగా డీ.కే రవి స్వస్థలం దొడ్డకుప్పల నుంచి బెంగళూరు వరకూ పాదయాత్రను చేపడుతామన్నారు. ‘ఓ క్రిమినల్ కేసుకు సంబంధించి నివేదికను చట్టసభల్లో ప్రవేశపెట్టకూడదు. అయితే సీఐడీ ప్రాథమిక నివేదికను రాష్ట్ర చట్టసభల్లో నేడు (సోమవారం) ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అదే గనుక జరిగితే ప్రభుత్వ విరుద్ధంగా న్యాయపోరాటానికి దిగుతాం.’ అని ప్రహ్లాద్‌జోషి హెచ్చరించారు. కాగా, నిరసన దీక్షలో కేంద్రమంత్రి అనంతకుమార్‌తోపాటు జగదీష్‌శెట్టర్, యడ్యూరప్ప తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement