వర్ని మండలం రుద్రూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.
వర్ని మండలం రుద్రూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దుర్కి పెద్ద సాయన్న(66) అనే వృద్ధుడు సోమవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయన్న పది సంవత్సరాల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు.