సినీ పంపిణీదారుడిపై నటి వనిత ఫిర్యాదు | Tamil actor Vanitha Vijayakumar files complaint against film | Sakshi
Sakshi News home page

సినీ పంపిణీదారుడిపై నటి వనిత ఫిర్యాదు

May 13 2015 2:53 AM | Updated on Aug 21 2018 7:58 PM

సినీ పంపిణీదారుడిపై నటి వనిత ఫిర్యాదు - Sakshi

సినీ పంపిణీదారుడిపై నటి వనిత ఫిర్యాదు

సినీ పంపిణీదారుడిపై నటి, నిర్మాత వనిత మంగళవారం పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. వనిత సీనియర్

తమిళసినిమా: సినీ పంపిణీదారుడిపై నటి, నిర్మాత వనిత మంగళవారం పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. వనిత సీనియర్ నటుడు విజయకుమార్ కూతురన్న విషయం గమనార్హం. అనంతరం వనిత విలేకరులతో మాట్లాడుతూ తాను వనిత ఫిలిం ప్రొడక్షన్స్ అనే చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి ఎంజీఆర్, శివాజి, రజనీ, కమల్ నర్పణి మండ్రం అనే చిత్రాన్ని నిర్మించానన్నారు. ఈ చిత్ర పంపిణీ హక్కులను వెబ్రన్ మూవీస్ వెంకటేష్ రాజాకు ఇచ్చానని తెలిపారు.

ఆయన తన చిత్రాన్ని 80 థియేటర్లలో విడుదల చేస్తానని ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. అలాగే చిత్ర ప్రచార ఖర్చు కంటూ 30 లక్షలను డిజిటల్ విధానంలో విడుదల చేయడానికంటూ ఎనిమిది లక్షలను తన నుంచి వెంకటేష్ రాజా తీసుకున్నారని చెప్పారు. చిత్రాన్ని అతి తక్కువ థియేటర్లలో విడుదల చేసి ఆయన ఒప్పందాన్ని మీరారని ఆరోపించారు. దీంతో నిర్మాతగా తనకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. అందువలన పంపిణీదారుడు వెంకటేష్‌రాజాను తాను ఇచ్చిన 38 లక్షలను తిరిగి చెల్లించాలని కోరుతూ ఆయనపై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు నటి, నిర్మాత వనిత వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement