పేద ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వానికి ఎలాంటి శ్రద్ధ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి అన్నారు.
హైదరాబాద్: పేద ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వానికి ఎలాంటి శ్రద్ధ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి అన్నారు. జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఏర్పాటు చేస్తానన్న ప్రభుత్వం ఉన్న ఆస్పత్రులనే పట్టించుకోవటం లేదని విమర్శించారు. పేదలు డెంగీ, మలేరియా వంటి రోగాలతో బాధపడుతుండగా వారిని పట్టించుకోవం మానేసి సెక్రటేరియట్, క్యాంప్ ఆఫీసు కట్టుకోవటానికే ప్రాధాన్యం ఇస్తోందని దుయ్యబట్టారు. వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.