ఫీజుల పెంపుపై విద్యార్థుల ఆగ్రహం | students fire on fees increment | Sakshi
Sakshi News home page

ఫీజుల పెంపుపై విద్యార్థుల ఆగ్రహం

Jan 8 2014 3:04 AM | Updated on Nov 9 2018 4:14 PM

ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలల్లో ఫీజులను 20 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 కోలారు, న్యూస్‌లైన్ : ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలల్లో ఫీజులను 20 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక బస్టాండ్ సర్కిల్‌లో మానవహారంగా ఏర్పడి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. డబ్బుపై ఆశతో ప్రైవేట్ కళాశాలలతో రాష్ట్ర ప్రభుత్వం కుమ్మకైందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయం గ్రామీణ పేద విద్యార్థుల పాటిల శాపంగా మారనుందని ఆందోళన వ్యక్తం చేశారు.
 
  ఇప్పటికే ధరల పెరుగుదలతో కుదేలైన గ్రామీణ ప్రాంత ప్రజలు ఇప్పుడు విద్యార్థుల ఫీజుల పెంపు వల్ల తమ పిల్లలకు ఉన్నత విద్యాభ్యాసాన్ని అందించలేని దుస్థితిలో నెట్టివేయబడ్డారని అన్నారు. పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు అంబరీష్, మార్కండేయ, అమరేష్, అజగర్, మహేష్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement