మాచర్లలో దారుణం : తండ్రి ఉద్యోగం కోసం | son brutally kills father in macherla over his govt job | Sakshi
Sakshi News home page

మాచర్లలో దారుణం : తండ్రి ఉద్యోగం కోసం

Dec 19 2016 9:02 PM | Updated on Sep 2 2018 4:37 PM

మాచర్లలో దారుణం : తండ్రి ఉద్యోగం కోసం - Sakshi

మాచర్లలో దారుణం : తండ్రి ఉద్యోగం కోసం

ప్రభుత్వ ఉద్యోగం కోసం తండ్రిని కొడుకు దారుణంగా హతమార్చిన ఘటన మాచర్లలో జరిగింది.

గుంటూరు: గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. తండ్రి చనిపోతే ఉద్యోగం తనకే వస్తుందన్న అత్యాశతో తండ్రినే కొడుకు అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన మాచర్లలో  సోమవారం చోటుచేసుకుంది.  

వివరాల్లోకి వెళితే... కార్మిక శాఖలో అటెండర్గా పనిచేస్తున్న శ్రీనివాసరావు(47)కు రెండు పెళ్లిళ్లు జరిగాయి. మొదటి భార్య మాధవి 10 ఏళ్ల కిందట చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండవ భార్య భారతి అనారోగ్యంతో 4 సంవత్సరాల క్రితం మృతిచెందింది. దీంతో శ్రీనివాసరావు సైదమ్మ అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. మొదటి భార్య కుమారుడు అమర్నాథ్ తండ్రి చేస్తున్న ఉద్యోగాన్ని వాలంటరీ రిటైర్‌మెంట్ ద్వారా తనకివ్వమని కోరుతున్నాడు.

తనకు ఉద్యోగం ఇవ్వడేమోనని అనుమానంతో తండ్రి చనిపోతే ఉద్యోగం తనకే వస్తుందని వ్యూహాం రచించాడు. అందులో భాగంగా సోమవారం మధ్యాహ్నం సమయంలో తండ్రిని రాయితో తలపై మోది దారుణంగా హతమార్చాడు. అనంతరం అమర్నాథ్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న అమర్నాథ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement