వైభవంగా శివన్న తనయ వివాహం | Sivanna grand daughter married | Sakshi
Sakshi News home page

వైభవంగా శివన్న తనయ వివాహం

Sep 1 2015 2:27 AM | Updated on Sep 3 2017 8:29 AM

వైభవంగా శివన్న తనయ వివాహం

వైభవంగా శివన్న తనయ వివాహం

శాండల్‌వుడ్ నటుడు శివరాజ్‌కుమార్ కుమార్తె డాక్టర్ నిరుపమా వివాహం సోమవారం బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్‌లో ఘనంగా

శాండల్‌వుడ్ నటుడు శివరాజ్‌కుమార్ కుమార్తె డాక్టర్ నిరుపమా వివాహం సోమవారం బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్‌లో ఘనంగా జరిగింది. బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌కు చెందిన ఎల్.మంజేగౌడ, పార్వతి దంపతుల ద్వితీయ కుమారుడు డాక్టర్ దిలీప్ కుమార్‌తో డాక్టర్ నిరుపమా ఏడడుగులు నడిచి దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునతో పాటు తమిళనటుడు ప్రభు, శాండల్‌వుడ్ నటులు దర్శన్, కిచ్చా సుదీప్, రవిచంద్రన్, గణేష్, సీనియర్ నటీమణులు జయంతి, అంబికా, లీలావతి, భారతి, జయమాలా తదితరులు హాజరయ్యారు. రాజకీయ ప్రముఖులు ఎస్.ఎంృకష్ణ, రాష్ట్ర మంత్రి ఆర్.వి.దేశ్‌పాండే, తమిళనాడుకు చెందిన స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. సోమవారం సాయంత్రం త్రిపుర వాసినిలో నిర్వహించిన రిసెప్షన్ కార్యక్రమానికి టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు రాజమౌళి హాజరుకావడం విశేషం.             - సాక్షి, బెంగళూరు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement