ఎస్‌ఐ శ్రీనివాసా మజాకా !

SI Srinivas Phone Warning HulChul In Social Media Karnataka - Sakshi

 అక్రమ మైనింగ్‌పై ఉక్కుపాదం

సింగం స్టైల్లో ఉన్నతాధికారితోపాటు రాజకీయ నాయకుడికి వార్నింగ్‌

వైరల్‌గా మారిన వీడియో

దొడ్డబళ్లాపురం: ఏ పోలీస్‌స్టేషన్‌కు బదిలీపై వెళ్లినా తనదైన స్టైల్లో విధులు నిర్వహిస్తూ వివాదాలను కొనితెచ్చుకునే విశ్వనాథపురం పోలీస్‌స్టేషన్‌ సబ్‌ఇన్స్‌పెక్టరర్‌ శ్రీనివాస్‌ మరోసారి తన సింగం స్టైల్లో పై అధికారికి, ఒక రాజకీయ నాయకుడికి ఫోన్‌లోనే క్లాస్‌ పీకారు. మంగళవారం తెల్లవారుజామునే తన పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అక్రమంగా మైనింగ్‌ జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి మైనింగ్‌ నిలిపివేయాలని హెచ్చరించారు. దీంతో అక్రమ మైనింగ్‌ నిర్వాహకులు పలువురు ప్రముఖులకు ఫోన్‌ చేశారు. తక్షణం ఎస్‌ఐ శ్రీనివాస్‌కు విజయపురం సీఐ మంజునాథ్, దేవనహళ్లి జేడీఎస్‌ నేత ఇద్దరూ ఫోన్‌చేసి మైనింగ్‌ను ఆపరాదని, వదిలేసి వెళ్లిపొమ్మని బెదిరించారు. దీంతో ఎస్‌ఐ శ్రీనివాస్‌ ఫోన్‌లోనే వారిని ఉతికారేసారు. మీరు, మీ అక్రమాలు అన్ని తెలుసు.

నా డ్యూటీ నేను చేస్తున్నాను. డ్యూటీకి అడ్డుపడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మీ భాగోతాలూ తోడతాను. పోలీసువై అక్రమాలకు కొమ్ము కాస్తావా? సిగ్గులేదూ అంటూ ఘాటుగా వార్నింగ్‌ ఇచ్చారు. దీంతో అక్కడున్న మైనింగ్‌ నిర్వాహకులు కాలికి బుద్ధిచెప్పారు. విశ్వనాథపురం పోలీస్‌స్టేషన్‌లో అక్రమ మైనింగ్‌కి సంబంధించి సంబంధించిన వారిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఘటనాస్థలంలో కొందరు ఈ వీడియో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top