శంకర్ దర్శకత్వంలో చిరంజీవి చిత్రం? | Shankar To Direct Chiranjeevi's 150th Movie ? | Sakshi
Sakshi News home page

శంకర్ దర్శకత్వంలో చిరంజీవి చిత్రం?

Jan 7 2015 2:52 AM | Updated on Aug 28 2018 4:30 PM

శంకర్ దర్శకత్వంలో చిరంజీవి చిత్రం? - Sakshi

శంకర్ దర్శకత్వంలో చిరంజీవి చిత్రం?

మెగాస్టార్ చిరంజీవి, స్టార్ దర్శకుడు శంకర్ కలయికలో త్వరలో భారీ చిత్రం రూపుదిద్దుకునే అవకాశాలు ఉన్నాయూ?

మెగాస్టార్ చిరంజీవి, స్టార్ దర్శకుడు శంకర్ కలయికలో త్వరలో భారీ చిత్రం రూపుదిద్దుకునే అవకాశాలు ఉన్నాయూ? ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్‌లలో జరుగుతున్న ఆసక్తికర చర్చ ఇది. మొన్నటి వరకు రాజకీయాలతో బిజీగా ఉన్న చిరంజీవి మళ్లీ సినిమాల్లో నటిస్తానని ప్రకటించారు. 149 చిత్రాలను పూర్తి చేసుకున్న చిరంజీవి 150వ చిత్రంకథ కోసం ఎదురు చూస్తున్నారు. గత ఏడాది ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం ఆరంభం అవుతుందన్న ప్రచారం సాగింది. అయితే, మంచి కథ దొరకని దృష్ట్యా, ఆ చిత్రం ప్రారంభం కాలేదు.
 
 అదే సమయంలో దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటించాలన్న ఆసక్తిని చిరంజీవి ఇటీవల వ్యక్తం చేశారు. విక్రమ్ హీరోగా ఐ చిత్రాన్ని పూర్తి చేసిన శంకర్, ఈ చిత్ర తెలుగు ఆడియో వేడుక ఇటీవల జరగ్గా, ఆ వేడుకలో దర్శకుడు రాజమౌళి మగధీర చిత్రం చూసి ఆయన అభిమాని అయినట్టు పేర్కొన్నారు. ఆయన తాజా చిత్రం బాహుబళి చిత్రాన్ని చూడాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్టు తెలిపారు. తాను తెలుగులో ఓ చిత్రం చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నట్టు తెలిపారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే చిరంజీవితో చిత్రం చేయడానికి శంకర్ రాయబారం చేస్తున్నట్టు తాజా సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement