బాలింతపై లైంగిక దాడి... | sexual assault on migrant worker | Sakshi
Sakshi News home page

బాలింతపై లైంగిక దాడి...

Sep 28 2016 11:11 AM | Updated on Aug 24 2018 2:36 PM

గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఒక బాలింతపై గుర్తుతెలియని వ్యక్తి లైంగికదాడి చేశాడు.

- నగదు చోరీ
నరసరావుపేట(గుంటూరు జిల్లా)

గుంటూరు జిల్లా నరసరావుపేటలో బుధవారం ఉదయం ఒక బాలింతపై గుర్తుతెలియని వ్యక్తి లైంగికదాడి చేశాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక కుటుంబం పదిహేను రోజులక్రితం కూలిపనుల కోసం నరసరావుపేటకు వచ్చింది. భార్యాభర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బంధువులను రైలు ఎక్కించేందుకు భర్త రైల్వే స్టేషన్‌కు వెళ్లగా నెల రోజుల బాలింత అయిన మహిళ ఇంట్లోనే ఒంటరిగా ఉంది. ఇది గమనించిన ఆగంతకుడు ఇంట్లో దూరి మహిళ నోట్లో బట్టకుక్కి ఆమెపై లైంగికదాడి చేశాడు. ఇంట్లో ఉన్న 12 వేల నగదు అపహరించుకువెళ్లాడు. భర్త ఇంటికి వస్తూనే విషయం చెప్పడంతో బాధితురాలితో సహా భర్త టూ టౌన్ పోలీస్ స్టేషన్ చేరుకుని ఫిర్యాదుచేశాడు. కేసు నమోదుచేసిన పోలీసులు దుండగుని కోసం గాలిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement