సీమాన్ ఎన్నికల ప్రచారం | Seaman election campaign | Sakshi
Sakshi News home page

సీమాన్ ఎన్నికల ప్రచారం

May 1 2016 1:55 AM | Updated on Sep 3 2017 11:07 PM

నత్తం అసెంబ్లీ నియోజకవర్గ నామ్ తమిళర్ కట్చి అభ్యర్థి శివశంకర్‌కు ఓటేయాలని పార్టీ నేత సీమాన్ కోరారు. గత 50 సంవత్సరాలుగా

మదురై:  నత్తం అసెంబ్లీ నియోజకవర్గ నామ్ తమిళర్ కట్చి అభ్యర్థి శివశంకర్‌కు ఓటేయాలని పార్టీ నేత సీమాన్ కోరారు. గత 50 సంవత్సరాలుగా తమిళనాడును పాలిస్తోన్న ద్రవిడ పార్టీల అధికారానికి పుల్‌స్టాప్ పెట్టండి అని అన్నారు. గత 50 ఏళ్లుగా పార్టీలు మారుతున్నాయి కాని నేతలు మారడం లేదన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం మానేసి వారి ధనాన్ని కొల్లగొట్టడమే లక్ష్యంగా ద్రవిడ పార్టీలు ముందుకు సాగుతున్నాయని ఎద్దేవా చేశారు. ‘తమిళనాడును తమిళ ప్రజలే పాలించాలి..వేరే భాష మాట్లాడేవారు పాలించడం అన్యాయం గత 50 ఏళ్లుగా ఇదే జరుగుతోంది. ఇకపై కళ్లు తెరవండి’ అని అన్నారు. మేం అధికారంలోకి వస్తే వైద్యం, తాగునీరు వంటి వాటిని ఉచితంగాఅందిస్తామని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement