పోలీస్ కమిషనర్‌కు శరవణన్ ఫిర్యాదు | Saravanan Complaint Police Commissioner | Sakshi
Sakshi News home page

పోలీస్ కమిషనర్‌కు శరవణన్ ఫిర్యాదు

Apr 23 2015 2:25 AM | Updated on Aug 21 2018 7:58 PM

నటుడు శరవణన్ బుధవారం ఉదయం నగర పోలీసు కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు లేఖను అందించారు.

 నటుడు శరవణన్ బుధవారం ఉదయం నగర పోలీసు కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు లేఖను అందించారు. తంబిదురై, తాయ్ మనసు తదితర చిత్రాల్లో హీరోగా నటించిన నటుడు శరవణన్. ప్రస్తుతం ఈయన వివిధ రకాల పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల ఆంధ్రరాష్ట్రం శేషాచలం ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారం ఇరు రాష్ట్రాల్లో తమిళనాడు, ఆంధ్ర, కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ స్మగ్లింగ్ కేసులో నటుడు శరవణన్ మంగళవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారనే ప్రచారం వాట్సాప్‌లో హల్‌చల్ చేసింది.
 
  దీంతో దిగ్భ్రాంతికి గురైన శరవణన్ బుధవారం చెన్నై నగర పోలీసు కమిషనర్‌కు కలిసి వాట్సాప్‌లో అసత్య ప్రచారంపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న షావుకారపేట్టై అనే చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నానని తెలిపారు. తనను పోలీసులు అరెస్టు చేశారన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.  తాను అన్నాడీఎంకే పార్టీ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నానని తెలిపారు. వాట్సాప్‌లో తనపై జరుగుతున్న దుష్ర్పచారంపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు నటుడు శరవణన్ వెల్లడించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement