బుల్లి తెరపై తీవ్ర ప్రభావం చూపుతున్న బిగ్‌బాస్ షోలో శాండిల్‌ఉడ్ నటులు, నిపుణులు ఎవరూ పాల్గొనవద్దని డిమాండ్ చేస్తూ కన్నడ చలనచిత్ర వాణిజ్యమండలి అధ్యక్షుడు సా.రా గోవిందు డిమాండ్ చేశారు.
బొమ్మనహళ్లి (బెంగళూరు) : బుల్లి తెరపై తీవ్ర ప్రభావం చూపుతున్న బిగ్‌బాస్ షోలో శాండిల్‌ఉడ్ నటులు, నిపుణులు ఎవరూ పాల్గొనవద్దని డిమాండ్ చేస్తూ కన్నడ చలనచిత్ర వాణిజ్యమండలి అధ్యక్షుడు సా.రా గోవిందు డిమాండ్ చేశారు. గోవిందు నేతృత్వంలో శనివారం నిర్మాతలు, సినిమా డిస్ట్రిబూటర్లు బిడిదిలోని ఇన్నోవేటివ్ ఫిల్మ్ సిటీలో వేసిన బిగ్‌బాస్ సెట్టింగ్ వద్ద ధర్నాకు దిగారు.
ఈ సందర్భంగా సారా గోవిందు మాట్లాడుతూ... యువత రియాల్టీ షోపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారని, దీని వల్ల సినిమా నిర్మాతలు నష్టపోతున్నారని అన్నారు. నటులు రియాల్టీ షోలలో పాల్గొన కూడదని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ బిగ్‌బాస్ రియాల్టీ షోలు జరిగినా అవి రాత్రి 10 గంటలపైన ప్రసారం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ధర్నాలో నిర్మాత హరీష్, ఎం.ఎన్.సురేష్, గిరిష్, గణేష్, ఆర్‌ఎస్.గౌడ, నరసింహులు, జయన్నలు తదితరులు పాల్గొన్నారు.