ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిలై రోడ్డు పక్కకు దూసుకెళ్లింది.
బ్రేకులు ఫెయిల్, పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు
Dec 24 2016 11:04 AM | Updated on Sep 4 2017 11:31 PM
- తప్పిన ప్రమాదం
కోడుమూరు: ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిలై రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. త్రుటిలో ప్రమాదం తప్పిన ఈ ఘటన కర్నూలు జిల్లా కోడుమూరులో జరిగింది. కర్నూలు- 2డిపోకు చెందిన బస్సు 25 మంది ప్రయాణికులతో శనివారం ఉదయం బళ్లారి వైపు వెళుతోంది. కోడుమూరు పెట్రోల్ బంక్ సమీపంలో బస్సు బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డు పక్కకు మళ్లించాడు. బస్సు పొలాల్లోకి దూసుకుపోయి ఆగింది. అయితే, బస్సు ఢీకొనటంతో ఒక ద్విచక్ర వాహనదారుడు స్వల్పంగా గాయపడ్డాడు. ఘటన అనంతరం ప్రయాణికులను ఇతర బస్సుల్లో గమ్యస్థానాలకు చేర్చారు.
Advertisement


