ఓటు వేస్తే సినిమా టికెట్‌పై రాయితీ | pune multiplex association bumper offer on movie tickets over corporation elections | Sakshi
Sakshi News home page

ఓటు వేస్తే సినిమా టికెట్‌పై రాయితీ

Feb 17 2017 7:00 PM | Updated on Aug 9 2018 7:20 PM

ఓటు వేస్తే సినిమా టికెట్‌పై రాయితీ - Sakshi

ఓటు వేస్తే సినిమా టికెట్‌పై రాయితీ

ఓటు హక్కు వినియోగించుకునే వారికి అనేక సంస్థలు రాయితీలను ప్రకటిస్తున్నాయి.

పుణె: ఓటు హక్కు వినియోగించుకునే వారికి అనేక సంస్థలు రాయితీలను ప్రకటిస్తున్నాయి. తాజాగా పుణే పింప్రీ–చించ్‌వడ్‌లో ఓటు హక్కు వినియోగించుకుంటే సినిమా టిక్కెట్లపై 15 శాతం డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్టు మల్టిప్లెక్స్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. దీంతో సినిమా అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.


పుణే, పింప్రీ–చించ్‌వడ్‌లతో పాటు రాష్ట్రంలోని పది మున్సిపల్‌ కార్పొరేషన్‌లలో ఈ నెల 21వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం అనేక ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా అనేక సంస్థల సహకారం కోరింది. దీంతో పుణే, పింప్రీ–చించ్‌వడ్‌లోని మల్టిప్లెక్స్‌ అసోసియేషన్‌ ముందుకు వచ్చింది. ఓటు హక్కు వినియోగించుకున్న వారికి సినిమా టిక్కెట్లపై 15 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అదేవిధంగా 21వ తేదీ సెలవు దినంగా కూడా ప్రభుత్వం ప్రకటించింది. దీంతోపాటు అనేక హోటళ్లు కూడా ఓటు హక్కు వినియోగించుకున్న వారికి రాయితీలను ప్రకటించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement