ప్రొ.కోదండరామ్ కు తప్పిన ప్రమాదం | prof.kodandaram car hits divider, no injuries | Sakshi
Sakshi News home page

ప్రొ.కోదండరామ్ కు తప్పిన ప్రమాదం

Oct 8 2016 1:12 AM | Updated on Sep 4 2017 4:32 PM

ప్రొ.కోదండరామ్ కు తప్పిన ప్రమాదం

ప్రొ.కోదండరామ్ కు తప్పిన ప్రమాదం

ప్రొ.ముద్దసాని కోదండరామిరెడ్డికి శుక్రవారం తృటిలో ప్రమాదం తప్పింది.

నల్లగొండ: తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్(టీజేఏసీ) ప్రొ.ముద్దసాని కోదండరామిరెడ్డికి శుక్రవారం తృటిలో ప్రమాదం తప్పింది. జిల్లాలోని తుంగతుర్తి నుంచి వరంగల్ వెళ్తున్న కారు తొర్రూరు వద్ద పంక్చర్ కావడంతో డివైడర్ ను ఢీ కొట్టింది.

వరంగల్ జిల్లా తొర్రూరులో సభలో పాల్గొని తిరిగి టీజేయేసీ అంతర్గత సమావేశంలో పాల్గొనడానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ప్రమాదంలో కోదండరామ్ తో పాటు కారులో ప్రయాణిస్తున్న వారందరూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద స్థలం నుండి అదే కారులో వరంగల్ లో టీజేయేసీ సమావేశానికి బయలుదేరి వెళ్లినట్లు టీజేయేసీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ పిట్టల రవీందర్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement