గ్రానైట్‌ క్వారీలో నరబలులపై విచారణ | Sakshi
Sakshi News home page

గ్రానైట్‌ క్వారీలో నరబలులపై విచారణ

Published Wed, Jul 13 2016 3:39 PM

గ్రానైట్‌ క్వారీలో నరబలులపై విచారణ - Sakshi

మధురై: తమిళనాడులోని మధురై జిల్లాలో జరిగిన గ్రానైట్‌ అవినీతిపై మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు ఐఏఎస్‌ అధికారి సహాయం విచారణ జరిపి నివేదిక దాఖలు చేశారు. గతంలో గ్రానైట్‌ అవినీతిపై సహాయం విచారణ జరిపినప్పుడు కీళవలవు సమీపంలోని కంబర్‌ మలై పట్టికి చెందిన సేవర్‌కుడియోన్‌ అనే వ్యక్తి పీఆర్‌పీ సంస్థాపకుడు కొంతమంది సిబ్బందిని నరబలి ఇచ్చినట్లు ఫిర్యాదు చేశాడు.

ఈ మేరకు విచారణ అధికారి అయిన సహాయం, పోలీసులు, ఆదాయశాఖ సమక్షంలో గత 2015 సెప్టెంబర్‌ నెల మణిముత్తారు శ్మశానంలో ఎముకలు వెలికి తీశారు. ఎముకలను వేలిముద్ర నిపుణులు ద్వారా మృతి చెందినవి స్త్రీల, పురుషులా? మృతి చెందిన వారి వయసు, వారిని ఖననం చేసి ఎన్ని సంవత్సరాలు పూర్తి అయ్యాయి? వంటి విషయాలపై ఇప్పటికే నివేదిక దాఖలు చేశారు. ఈ క్రమంలో మృతి చెందిన వారి బంధువులు 11 మందిని గుర్తించి వారివద్ద డీఎన్‌ఏ పరీక్షలు చేయడానికి ప్రభుత్వ ఆసుపత్రికి వారందరినీ పోలీసులు పిలుచుకుని వెళ్లి పరీక్షలు జరిపారు. వైద్య ఫలితాల నివేదిక వచ్చిన అనంతరం నిజానిజాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement