కాడుగోడి ప్రగతి కాలేజీ హస్టల్‌లో విద్యార్థిని గౌతమి మతిృి కారకుడైన అటెండర్ మహేష్
పొంతనలేని మహేష్ సమాధానాలతో
తలలు పట్టుకుంటున్న అధికారులు
బెంగ ళూరు(బనశంకరి): కాడుగోడి ప్రగతి కాలేజీ హస్టల్‌లో విద్యార్థిని గౌతమి మతిృి కారకుడైన అటెండర్ మహేష్... విచారణ సమయంలో విచిత్రమైన సమాధానాలు ఇస్తూ పోలీస్ అధికారులకు తలనొప్పి సిృ్టస్తున్నాడు. మానసిక అస్వస్థతకు గురైన అతని ప్రవర్తన విచిత్రంగా ఉంది. ఈ వైఖరే కాల్పులకు కారణమై ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. కోరమంగళ ఏసీఎంఎం న్యాయమూర్తి ఎదుట గురువారం సాయంత్రం మహేశ్‌ను హాజరుపరిచారు. ఈ నెల 10వ తేదీ వరకు అతన్ని పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. విచారణ సమయంలో మహేశ్ ఇస్తున్న సమాధానాలు ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఉన్నాయి. అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్న మహేశ్ నుంచి నిజాలు వెలికితీయడానికి విచారణ అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది.
కృ్ణరాజపురం వద్ద రెండేళ్ల క్రితం ఓ పనినిమిత్తం వెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తి తనకు రూ.2,500 పిస్తోల్ విక్రయించాడని చెబుతున్న మహేశ్ దానిని ఏ కారణం చేత కొనుగోలు చేశాడన్న ప్రశ్నకు సరైన సమాధానం చెప్పడం లేదు. తనకు పిస్తోలు అవసరం లేదని అంటూ గుర్తుతెలియని వ్యక్తి బలవంతం చేసి అంటగట్టాడని తెలిపినట్లు తెలుస్తోంది. పిస్తోలు తీసుకెళ్లి అక్క ఇంటిలోని సూట్‌కేస్‌లో పెట్టానని తెలిపాడు. గౌతమి, శిరీషాపై కాల్పుల విషయంపై విభిన్న కథనాలు వినిపిస్తున్నాడు. కాలేజీలో తనను నిర్లక్ష్యంగా చూశారని భద్రత దృ్ట్య తాను కఠినంగా ఉంటుండడంతో ఒకసారి గౌతమి తనపై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసిందని దీంతో ఆమెపై కక్ష పెంచుకున్నానని అంటున్నాడు. గౌతమి తన ప్రేమను నిరాకరించి ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయడంతో ఆమెపై ద్వేషం పెంచుకుని టార్గెట్ చేశానని మరోసారి తెలిపాడు.