ఆకాశ మార్గంలో కొకైన్ స్మగ్లింగ్ | passenger arrested at the Kempegowda International Airport, who smuggling cocaine | Sakshi
Sakshi News home page

ఆకాశ మార్గంలో కొకైన్ స్మగ్లింగ్

Aug 21 2015 5:45 PM | Updated on Sep 3 2017 7:52 AM

ఆకాశ మార్గంలో కొకైన్ స్మగ్లింగ్

ఆకాశ మార్గంలో కొకైన్ స్మగ్లింగ్

టెక్ నగరం బెంగళూరులో జరిగే నైట్ పార్టీల కోసమే ఈ కొకైన్ సరఫరా అవుతున్నట్లు గుర్తించామని పోలీసులు చెప్పారు.

బెంగళూరు: మాదకద్రవ్యాల అక్రమరవాణా కోసం పాతాళంలో భారీ సొరంగాలు తొవ్వడం మెక్సికన్ స్మగ్లర్ల స్టైల్. అంతకు తక్కువేమీ కాదంటూ బాహాటంగా ఆకాశమార్గంలో ఇండియాకు కొకైన్ తరలిస్తూ ఓ వ్యక్తి పట్టుబడ్డాడు.

 

బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలను నార్కోటిక్స్ అధికారులు శుక్రవారం వెల్లడించారు.

ఎమిరెట్స్ విమానంలో దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి రూ. 20 కోట్ల విలువైన 3.34 కేజీల కొకైన్ ను ఎయిర్ పోర్టు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

 

టెక్ నగరం బెంగళూరులో జరిగే నైట్ పార్టీల కోసమే ఈ కొకైన్ సరఫరా అవుతున్నట్లు గుర్తించామని పోలీసులు చెప్పారు. నిందితుడ్ని జ్యుడిషిల్ కస్టడీకి తరలించామని, కేసును మరింత లోతుగా దర్యాప్తు చేశామని తెలిపారు. ఎయిర్ పోర్టులో ఇంత భారీ స్థాయిలో కొకైన్ పట్టుబడటం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement