breaking news
air way
-
ఎయిర్ షోలో జెట్ విమానాల ఢీ
సాక్షి, బెంగళూరు: భారత వాయుసేనలో వైమానిక విన్యాసాల బృందానికి చెందిన రెండు జెట్ విమానాలు గాల్లో ఢీకొని కుప్పకులాయి. బెంగళూరు దగ్గర్లోని యలహంక వైమానిక స్థావరంలో ‘ఎయిరో ఇండియా షో’ వైమానిక ప్రదర్శన నేడు ప్రారంభంకానుంది. షో రిహార్సల్స్‌లో భాగంగా మం గళవారం ఉదయం సూర్యకిరణ్ ఎరోబాటిక్ టీం జెట్ విమానాలు విన్యాసాలు చేస్తున్నాయి. తలకిందులుగా ప్రయాణిస్తున్న ఒక జెట్ విమానం.. మరో విమానం మీద నుంచి వెళ్తూ విన్యాసం చేస్తోంది. తలకిందులుగా వెళ్తున్న విమానం ఒక్కసారిగా అదుపుతప్పి కిందనున్న విమానం వెనుకభాగంపై పడింది. దీంతో రెండు విమానాలూ అదుపుతప్పి వాయువేగంతో నేలను ఢీకొని మంటల్లో చిక్కుకున్నాయి. ఈ ఘటనలో సాహిల్ గాంధీ అనే పైలట్ ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు పైలట్లు ప్రాణాలతో బయటపడ్డారు. కానీ, వీరిద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. వీరిని వెంటనే మరో విమానంలో బెంగళూరులోని ఎయిర్‌ఫోర్స్ కమాండ్ ఆస్పత్రికి తరలించారు. రెండు విమానాలు యలహంక ఎయిర్‌బేస్ సమీపంలోని ఘంటిగా నహళ్లి గ్రామంలో పడ్డాయి. జెట్ విమానాల శిథిలాలు అదృష్టవశాత్తు ఇళ్ల మధ్య ఖాళీ స్థలంలో పడటంతో అక్కడి స్థానికులెవరూ గాయపడలేదు. -
ఆకాశ మార్గంలో కొకైన్ స్మగ్లింగ్
బెంగళూరు: మాదకద్రవ్యాల అక్రమరవాణా కోసం పాతాళంలో భారీ సొరంగాలు తొవ్వడం మెక్సికన్ స్మగ్లర్ల స్టైల్. అంతకు తక్కువేమీ కాదంటూ బాహాటంగా ఆకాశమార్గంలో ఇండియాకు కొకైన్ తరలిస్తూ ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలను నార్కోటిక్స్ అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఎమిరెట్స్ విమానంలో దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి రూ. 20 కోట్ల విలువైన 3.34 కేజీల కొకైన్ ను ఎయిర్ పోర్టు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టెక్ నగరం బెంగళూరులో జరిగే నైట్ పార్టీల కోసమే ఈ కొకైన్ సరఫరా అవుతున్నట్లు గుర్తించామని పోలీసులు చెప్పారు. నిందితుడ్ని జ్యుడిషిల్ కస్టడీకి తరలించామని, కేసును మరింత లోతుగా దర్యాప్తు చేశామని తెలిపారు. ఎయిర్ పోర్టులో ఇంత భారీ స్థాయిలో కొకైన్ పట్టుబడటం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.