
ఇళయదళపతిని మిస్సయ్యా
ఇళయదళపతి విజయ్‌తో నటించే అవకాశా న్ని మిస్ అయ్యానని నటి భావన చింతిస్తున్నారు.
ఇళయదళపతి విజయ్‌తో నటించే అవకాశా న్ని మిస్ అయ్యానని నటి భావన చింతిస్తున్నారు. ఈ కేరళ కుట్టి మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రము ఖ హీరోయిన్‌గా వెలుగొందుతూ చిత్తిరం పేసుద డి చిత్రం ద్వారా కోలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆ చి త్ర విజయంతో ఇక్కడ వరుసగా అవకాశాలు రాబట్టుకున్నారు. ఆ తరువాత దీపావళి, కూడల్ నగర్ చిత్రా ల్లో నటించారు. అలా నటుడు అజిత్‌కు జంటగా అసల్ చిత్రంలో నటించే స్థాయికి చేరుకున్న భావనకు ఆ తరువాత అవకాశాలు తగ్గుముఖం పట్టా యి. దీంతో తెలుగు, మలయాళం భాషల్లో దృష్టి సారించారు.
అలాంటిది ఆ మధ్య విజయ్ సరసన పులి చిత్రంలో నటించే అవకాశం వచ్చినా అందుకోలేక పోయిందట. దీని గురించి భావ న తెలుపుతూ విజయ్ సరసన పులి చిత్రంలో నటించే అవకాశం వచ్చిందన్నారు. అయితే ఆ సమయంలో మలయాళ చిత్రంలో నటించ డం వలన కాల్‌షీట్స్ సర్దుబాటు కాకపోవడంతో నటించడానికి అంగీకరించలేదని వివరించారు. అదే కాదు తన రీ ఎంట్రీకి చా లా తమిళ చిత్రాల అవకాశాలను నిరాకరిం చానని అవన్నీ సూపర్‌హిట్ అయ్యాయని అన్నారు. అయినా ఎలాంటి చింతా లేదని అయితే విజయ్ చిత్రానికి చేజార్చుకోవడమే కాస్త బాధగా ఉందని భావన అన్నారు.