శరవేగం | Nuclear power in Russia Rapidly | Sakshi
Sakshi News home page

శరవేగం

Dec 23 2013 1:37 AM | Updated on Sep 2 2017 1:51 AM

శరవేగం

శరవేగం

తిరునల్వేలి జిల్లా కూడంకుళంలో భారత్, రష్యా సంయుక్త ఆధ్వర్యంలో అణు విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పిన విషయం తెలిసిందే. తొలియూనిట్ పనులు ముగి శాయి.

సాక్షి, చెన్నై: తిరునల్వేలి జిల్లా కూడంకుళంలో భారత్, రష్యా సంయుక్త ఆధ్వర్యంలో అణు విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పిన విషయం తెలిసిందే. తొలియూనిట్ పనులు ముగి శాయి. రెండో యూనిట్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ కేంద్రానికి వ్యతిరేకంగా ఇడిందకరై వేదిక గా పెద్ద ఉద్యమమే సాగుతోంది. ఈ ఉద్యమం కారణం తో తొలి యూనిట్‌లో అధికారిక ఉత్పత్తికి కొన్నాళ్లు బ్రేక్‌పడింది. ఎట్టకేలకు అక్టోబరు 22న చడీ చప్పుడు కాకుం డా శ్రీకారం చుట్టేశారు. తొలుత 160 మెగావాట్ల మేర కు విద్యుత్ ఉత్పత్తి లభించగా, దాన్ని కేంద్ర గ్రిడ్‌కు పం పించారు. అక్కడ పరిశీలనానంతరం విద్యుత్ ఉత్పత్తి మరింత వేగవంతం చేశారు. అణువిద్యుత్ వ్యతిరేకులు ఉద్యమానికి నిర్ణయించడంతో చాప కింద నీరులా ఉత్పత్తి ప్రక్రియను క్రమంగా పెంచే పనిలో అధికారులు పడ్డారు. అణు కేంద్రంలో  ఉత్పత్తి ఆగినట్టుగా, జరుగుతున్నట్టుగా రకరకాల ప్రచారం గత కొద్దిరోజులుగా సాగుతోంది. దీంతో ఉత్పత్తి క్రమంగా పెరుగుతున్న విషయాన్ని అధికారులు ఆదివారం ప్రకటించారు. 
 
 400 మెగావాట్లు: అణు కేంద్రంలో 500 మెగావాట్ల వరకు విద్యుత్ ఉత్పత్తికి అణు విద్యుత్ క్రమబద్ధీకరణ 
 కమిషన్ అనుమతి ఇచ్చింది. దీంతో క్రమంగా ఉత్పత్తిని 500 మెగావాట్లకు దరి చేర్చే పనుల్లో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ఉన్నారు. ఈ నెలాఖరులోపు ఆ లక్ష్యాన్ని చేరుకునే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఇక కొత్త ఏడాదిలో అదనంగా మరో 250 మెగావాట్ల ఉత్పత్తికి శ్రీకారం చుట్టనున్నారు.  750 మెగావాట్లు: మదురైలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో అణు విద్యుత్ కేంద్రం డెరైక్టర్(ఉత్పత్తి విభాగం) సుందర్ మీడియాతో మాట్లాడుతూ, అణు విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి వేగవంతం అయిందన్నారు. అణు వ్యతిరేకుల ఆందోళనల కారణంగా తరచూ ఉత్పత్తికి ఆటకం ఏర్పడుతోన్నదన్నారు. అన్ని అడ్డంకుల్ని అధిగమించి 400 మెగావాట్లకు  ఉత్పత్తి చేరిందన్నారు. ఇదులో యాభై శాతం తమిళనాడుకు, మిగిలిన విద్యుత్ పుదుచ్చేరి, కూడంకులం పరిసర ప్రాంతాలకు విని యోగిస్తున్నామని వివరించారు. జనవరి లో 750 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా చర్యలు చేపట్టామన్నారు. విద్యుత్ ఉత్పత్తి మరి కొద్ది రోజుల్లో పూర్తి స్థాయి చేరుకోబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. విద్యుత్ కొరత ఒక్క తమిళనాడులోనే లేదని, అన్ని రాష్ట్రాలు ఎదుర్కొంటున్నాయన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement