
'సీఎం మాటలకూ విలువ లేదు'
అదృశ్యమైన భువనగిరి సబ్‌జైల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు ఖమ్మంలో ప్రత్యక్షమయ్యారు.
భువనగిరి: ఉద్యోగానికి వెళ్తున్నానంటూ గతరాత్రి అదృశ్యమైన భువనగిరి సబ్‌జైల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు బుధవారం ఖమ్మంలో ప్రత్యక్షమయ్యారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో శ్రీనివాసరావు చికిత్స పొందుతున్నట్టు తెలిసింది. మూడు రోజుల క్రితం ఆయన్ని జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేటకు బదిలీ చేశారు. దీనిపై శ్రీనివాస్ తీవ్ర మనస్తాపం చెందారు. ఉద్యోగానికి వెళ్తున్నానంటూ ఆయన నిన్న రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. (చదవండి: సబ్జైలు సూపరిండెంటెంట్ అదృశ్యం)
బుధవారం ఉదయం ఇంటికి చేరుకోకపోవడంతో శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ క్రమంలో గదిలో శ్రీనివాస్ రాసిన లేఖను కుటుంబ సభ్యులు గుర్తించారు. తెలంగాణ జైళ్ల శాఖ ఉన్నతాధికారుల వేధింపులు భరించలేకే తాను వెళ్లిపోతున్నట్లు లేఖలో తెలిపాడు. జైళ్ల శాఖలో ఉన్నతాధికారి చెప్పిందే వేదమని, సీఎం మాటలకు కూడా విలువ లేదని శ్రీనివాసరావు లేఖలో పేర్కొన్నాడు.