నేపాల్ బాధితులకు ఏడాది వేతనం | Nepal to pay the victims of the year | Sakshi
Sakshi News home page

నేపాల్ బాధితులకు ఏడాది వేతనం

Apr 29 2015 2:21 AM | Updated on Oct 20 2018 6:37 PM

నేపాల్ బాధితులకు  ఏడాది వేతనం - Sakshi

నేపాల్ బాధితులకు ఏడాది వేతనం

శాసనమండలి సభ్యుడిగా తన ఏడాది వేతనాన్ని నేపాల్ భూకంప బాధితులకు అందజేయనున్నట్లు కేపీసీసీ చీఫ్ డాక్టర్ పరమేశ్వర్ తెలిపారు.

బెంగళూరు: శాసనమండలి సభ్యుడిగా తన ఏడాది వేతనాన్ని నేపాల్ భూకంప బాధితులకు అందజేయనున్నట్లు కేపీసీసీ చీఫ్ డాక్టర్ పరమేశ్వర్ తెలిపారు. బెంగళూరులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత మంత్రిమండలి పునఃరచనతో పాటు విస్తరణ కూడా ఉంటుందని తెలిపారు.

ఈ విషయమై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తాను చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. వచ్చేనెల 13కు  కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతుందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఈ రెండేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు తెలియజెప్పడానికి ఉత్తర కర్ణాటక భాగంలో ృహత్ సమావేశం జరిపే ఆలోచన ఉందని తెలిపారు.   
 
 

Advertisement
 
Advertisement
Advertisement