నయీం అనుచరుడి అనుమానాస్పద మృతి | nayeem follower pullari mahesh suspicious death in siddipet | Sakshi
Sakshi News home page

నయీం అనుచరుడి అనుమానాస్పద మృతి

Nov 23 2016 8:15 PM | Updated on Sep 4 2017 8:55 PM

గ్యాంగ్‌స్టర్ నయీం ముఖ్య అనుచరుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.

హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీం ముఖ్య అనుచరుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. నయీం ఎన్‌కౌంటర్ జరిగినప్పటి నుంచి  తప్పించుకొని తిరుగుతున్న టీఆర్‌ఎస్ ఎంపీటీసీ సభ్యుడు పుల్లరి మహేష్ అలియాస్ ప్రసాద్ బుధవారం సిద్దిపేటలోని ఓ ఇంట్లో  అనుమానాస్పద పరిస్థితుల్లో విగతజీవిగా కనిపించాడు.

మహేష్ కోసం కొన్ని రోజులుగా సిట్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. నాలుగు నెలలుగా పోలీసుల కంటపడకుండా తిరుగుతున్నాడు. ఆరు హత్య కేసుల్లో ఇతను నిందితుడిగా ఉన్నాడు. నయీంతో కలసి పలు భూ దందాల్లో పాల్గొనట్లు తెలుస్తోంది. అనూహ్యంగా ఇతను మృతిచెందడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మహేషే ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా అతన్ని హతమార్చారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. దీనిపై సిద్దిపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నయీం గ్యాంగ్లో కీలక సభ్యుడు సామా సంజీవరెడ్డిని అరెస్టు చేసిన రోజే మరో అనుచరుడైన మహేష్ అనుమానాస్పదంగా మృతి చెందడం అనుమానాలకు దారితీస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement