గ్యాంగ్‌స్టర్ నయీం జీవితాధారంగా సినిమా.. ట్రైలర్‌ విడుదల | Gangster Nayeem Biopic Movie Nayeem Diaries Trailer Out | Sakshi
Sakshi News home page

Gangster Nayeem Biopic: గ్యాంగ్‌స్టర్ నయీం జీవితాధారంగా సినిమా.. ట్రైలర్‌ విడుదల

Nov 16 2021 3:30 PM | Updated on Nov 16 2021 4:44 PM

Gangster Nayeem Biopic Movie Nayeem Diaries Trailer Out - Sakshi

కరుడుగట్టిన నేరస్థుడు గ్యాంగ్‌స్టర్‌ నయీం జీవితాధారంగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దాము బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు 'నయీం డైరీస్‌' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. వశిష్ట సింహ ప్రధాన పాత్రలో నటించగా, సీఏ వరదరాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను దర్శకుడు సంపత్ నంది సోమవారం రిలీజ్‌ చేశారు. ఇలాంటి నిజ జీవిత కథలతో సినిమాలు చేస్తున్నప్పుడు కచ్చితంగా ఆసక్తికరంగా ఉంటుందని సంపత్‌ నంది తెలిపారు. ఈ చిత్రం పెద్ద హిట్‌ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

హీరో వశిష్ట్‌ మాట్లాడుతూ 'ఆత్మవిశ్వాసంతో చెబుతున్నా ఈ చిత్రం కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. నాకు చాలా ప్రత్యేకమైన సినిమా అవుతుంది.' అని అన్నారు. ' ఈ సినిమాలో నయీం ఎందుకు క్రిమినల్‌గా మారాడు. అతన్ని మించిన నేరస్థులు సమాజంలో ఎవరున్నారు ? అనేది సినిమాలో చూపిస్తున్నాం.' అని చిత్ర దర్శకుడు బాలాజీ తెలిపారు. నయీం కథ వినగానే యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో బాగుంటుందని చేశామని నిర్మాత వరదరాజు తెలిపారు. వశిష్ట తామనుకున్న దానికన్న బాగా చేశారని కొనియాడారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement