తాగుడుకు బానిసై భార్యను వేదిస్తున్న ఓ యువకున్ని కన్న తల్లే కడతేర్చింది.
కోడలి కోసం కొడుకును చంపిన తల్లి..
Aug 18 2017 11:24 AM | Updated on Sep 12 2017 12:25 AM
ముంబై: తాగుడుకు బానిసై భార్యను వేదిస్తున్న ఓ యువకున్ని కన్న తల్లే కడతేర్చింది. ఈ ఘటన ముంబైలోని మన్‌ఖుర్ద్‌లోని అంబేద్కర్ చౌల్‌లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం నదీమ్(25) అతని భార్య, తల్లి అన్వారీ ఇద్దరు సోదరులతో స్థానికంగా నివసిస్తున్నాడు. తాగుడుకు బానిసైన నదీమ్ రోజు గర్భవతి అయిన తన భార్యను కొడుతున్నాడు.
గత మంగళవారం రాత్రి తాగి వచ్చిన నదీమ్ భార్యపై చేయిజేసుకున్నాడు. అడ్డుకున్న తల్లిపై కూడా దాడి చేశాడు. దీంతో అన్వారీ చిన్న కొడుకు సహయంతో నదీమ్‌ను తాళ్లతో కట్టేసింది. కుటుంబ సభ్యులందరినీ పక్కింటికి వెళ్లమని చెప్పింది. నదీమ్ కట్టేసిన కూడా తల్లిని తిడుతుండటంతో సహనం కోల్పోయిన అన్వారి దుప్పటితో గొంతు నులిమి చంపింది. కాసేపటికి ఇంట్లోకి వచ్చిన కోడలికి అన్వారి కొడుకు పక్కన కూర్చోని ఏడవడం కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసుకోని అన్వారీని రిమాండ్‌కు తరలించారు.
Advertisement
Advertisement