పెళ్లి పందిరి కాదుపోలింగ్ కేంద్రం | Modern polling stations set up by the Election Commission | Sakshi
Sakshi News home page

పెళ్లి పందిరి కాదుపోలింగ్ కేంద్రం

Apr 24 2014 12:34 AM | Updated on Aug 14 2018 4:32 PM

పెళ్లి పందిరి కాదుపోలింగ్ కేంద్రం - Sakshi

పెళ్లి పందిరి కాదుపోలింగ్ కేంద్రం

చెన్నైలో ఉన్న మూడు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఐదు మోడ్రన్ పోలింగ్ కేంద్రాలను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిం ది. ఈ కేంద్రాల్లో ఓటు హక్కును

ప్యారిస్, న్యూస్‌లైన్:చెన్నైలో ఉన్న మూడు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఐదు మోడ్రన్ పోలింగ్ కేంద్రాలను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిం ది. ఈ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చే ఓటర్లకు పన్నీరు చల్లి, రెడ్ కార్పెట్‌తో ఆహ్వానం పలకనున్నారు. ఎన్నికల కమిషనర్ ప్రవీణ్ కుమార్ ఉత్తర్వుల మేరకు నగరంలోని ఉత్తర చెన్నై నియోజకవర్గంలో ఒకటి, దక్షిణ, సెంట్రల్ చెన్నైలలో రెండు చొప్పున మొత్తం ఐదు మోడ్రన్ పోలింగ్ కేం ద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రా ల్లో ఓటు వేసే ఓటర్లకు కొత్త అనుభూతిని ఇచ్చే రీతిలో చర్యలు చేపట్టారు. అరటి మొక్కలు, మామిడి తోరణాలతో అలంకరించిన మోడ్రన్ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు పన్నీరు చల్లి, రెడ్ కార్పెట్‌తో ఆహ్వానం పలుకుతారు. ఇంకనూ కేంద్రంలో అత్యాధునిక కుర్చీలతో రిసెప్షన్ హాల్ ఉంటుంది.
 
 అక్కడికి ఓటర్లను ఎన్నికల సిబ్బంది తీసుకు వెళ్లి కూర్చోబెడతారు. ఈ కేంద్రాల్లో పని చేసే సిబ్బంది యూనిఫామ్, గుర్తింపు కార్డులతో కనిపిస్తారు. ఈ కేంద్రాల్లో ఎయిర్ కూలింగ్ సౌకర్యం ఉంటుంది. ఈవీఎంలను అట్ట పెట్టెల చాటున పెట్టకుండా ప్రత్యేకంగా రూపొందించిన మరుగైన టేబుల్‌పై ఉంచుతారు. ఒక ఓటరు ఓటు వేసి బయటకు వచ్చిన తర్వాత మరొకరిని లోపలికి పంపిస్తారు. రిసెప్షన్ హాల్‌లో కూర్చుని ఉన్న ఓటర్లకు చల్లటి మజ్జిగను అందిస్తారు. ఈ కేంద్రాలకు వచ్చే వికలాంగులు, వృద్ధుల కోసం వీల్ చైర్ సౌకర్యం కల్పించారు. ఈ విధమైన ఒక మోడ్రన్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు ఒక్కో కేంద్రానికి 60 వేల రూపాయలు ఖర్చు చేసినట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇలాంటి మోడ్రన్ కేంద్రాలు ఏర్పాటు చేయడం ఇదే ప్రప్రథమం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement