బాధిత ప్రాంతాల్లో స్టాలిన్‌ పర్యటన | MK Stalin tour in Kolathur constituency | Sakshi
Sakshi News home page

బాధిత ప్రాంతాల్లో స్టాలిన్‌ పర్యటన

Dec 15 2016 2:54 AM | Updated on Sep 4 2017 10:44 PM

డీఎంకే కోశాధికారి ఎం.కె.స్టాలిన్‌ కొళత్తూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నేరుగా వెళ్లి వర్దా తుపాన్‌ ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు.

కేకే.నగర్‌: డీఎంకే కోశాధికారి ఎం.కె.స్టాలిన్‌ కొళత్తూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నేరుగా వెళ్లి వర్దా తుపాన్‌ ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. తుపాన్‌ బాధిత ప్రాంతాలను యుద్ధప్రాదిపదికన సరిచేయాలని ప్రభుత్వ అధికారులను కోరారు. కారులో వెళ్లలేని ప్రాంతాలను బైకుపై వెళ్లి బాధితులకు సహాయకాలు అందజేశారు. వర్దా కారణంగా అంటువ్యాధులు ప్రబలకుండా  కొళత్తూరు ప్రాంతంలోని ప్రజలకు ముందస్తు చర్యగా రోగ నిరోధక మందులు, నివారణ సహాయకాలను అందించారు. ఇంకనూ వర్షపునీరు నిల్వతో అంటువ్యాధులు వ్యాపించకుండా ప్రభుత్వం, కార్పొరేషన్, సంబంధిత విభాగ అధికారులు వెంటనే బాధిత ప్రాంతాలకు వెళ్లి వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని, తాగునీరు, పాలు వంటి అత్యవసర వస్తువులను కొరత లేకుండా అందజేయడంపై సత్వర చర్యలు చేపట్టాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement