పాలనా సౌలభ్యం కోసమే సీఎం కేసీఆర్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టారని మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు.
‘నిర్లక్ష్యంపై చర్యలు తప్పవు’
Nov 1 2016 2:49 PM | Updated on Sep 4 2017 6:53 PM
చేవెళ్ల: పాలనా సౌలభ్యం కోసమే సీఎం కేసీఆర్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టారని మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం ఆయన చేవెళ్ల మండల సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. సమావేశానికి హాజరు కాని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుమునుపు ఆయన చేవెళ్లలో ఏసీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
Advertisement


