తమ్ముడి భార్య కోసం ఆత్మహత్యాయత్నం | man try to attempt suicide for brothers wife in tamilnadu | Sakshi
Sakshi News home page

తమ్ముడి భార్య కోసం ఆత్మహత్యాయత్నం

Aug 13 2016 7:28 PM | Updated on Sep 4 2017 9:08 AM

తమ్ముడి భార్య కోసం ఆత్మహత్యాయత్నం

తమ్ముడి భార్య కోసం ఆత్మహత్యాయత్నం

తమ్ముడి భార్యను తనతో పంపాలని, లేకపోతే సెల్‌ఫోన్‌ టవర్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డాడు ఓ వ్యక్తి.

కేకే.నగర్‌(చెన్నై): తమ్ముడి భార్యను తనతో పంపాలని, లేకపోతే సెల్‌ఫోన్‌ టవర్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన కారైకుడిలో సంచలనం కలిగించింది. శివగంగై జిల్లా కారైకుడికి చెందిన కరుప్పయ్య. ఇతనికి జయచంద్రన్, మురుగన్‌ అనే కుమారులు ఉన్నారు. ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు.

మురుగన్‌కు మద్యం తాగే అలవాటు ఉండడంతో అతనిపై కోపంతో భార్య ముంతాజ్‌బేగం అతడిని వదలి వెళ్లిపోయింది. దీంతో విరక్తి చెందిన మురుగన్‌ పీకల దాకా మద్యం తాగి అదే ఊరులో ఉన్నసెల్‌ఫోన్‌ టవర్‌ ఎక్కాడు. సమాచారాన్ని పోలీసులకు, అగ్నిమాపక దళానికి అందించడంతో వారు అతడిని కిందకు దిగాలని సూచించారు. తన తమ్ముడు జయచంద్రన్‌ భార్యను తనతో పంపించాలని లేకపోతే పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. పోలీసులు అతడిని నచ్చచెప్పి కిందకు దింపారు. కిందకు దిగిన మురుగన్‌ పారిపోవడానికి గోడ దూకడంతో గాయపడ్డాడు. అతడిని పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement